Ex MLA Son Case: మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించి మరోకరిపై కేసు.. బయటపడుతున్న పంజాగుట్ట పోలీసుల నిర్వాకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ కేసు మలుపు తీరుగుతున్నాయి. నిన్నిటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సోహైల్ స్థానంలోకి మాజీ ఎమ్మెల్యే పని మనిషి వచ్చాడు. ఈ కేసు నుంచి సోహైల్‌ను తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యేతో కలిసి పంజాగుట్ట పోలీసులు కుట్ర పన్నినట్టుగా విచారణలో వెల్లడైంది. కాగా గత ఆదివారం అర్థరాత్రి మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో దూసుకొచ్చి ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Bhatti Vikramarka: ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
ఆ సమయంలో సోహైల్ మద్యం తాగి కారు నడిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అరెస్ట్ అయిన కొడుకు కోసం మాజీ ఎమ్మెల్యే షకిల్ రాత్రి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు రావడంతో ఇప్పుడు ఈ కేసు రాజకీయంగా మలుపు తిరిగింది. షకిల్ స్టేషన్ వచ్చి వెళ్లిన అనంతరం ఈ కేసులో సోహైల్‌ను తప్పించి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషిని పోలీసులు కేసులో నిందితుడిగా చేర్చారు. దీంతో ఈ యాక్సిడెంట్ వ్యవహారం రాజకీయాలకు దారితీస్తుండటంతో సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. సోహైల్ అరెస్ట్ అనంతరం మాజీ ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌కు వచ్చి వెళ్లినట్టు సీసీటీవీలో రికార్డయింది.
Also Read: Law Student Arrest: మాజీ ప్రియుడిపై పగ.. కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించిన లా స్టూడెంట్
దీంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు జరగుుతన్న క్రమంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థకు గురైనట్టు సమాచారం. బీపీ పెరిగిపోవడంతో అధికారులు ఆయనను ప్రవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. సోహైల్‌తో రాత్రి కాల్స్ మాట్లాడిన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా గతంలోనూ సోహైల్‌ను ఓ రోడ్డు ప్రమాదం కేసులో తప్పించినట్టు విచారణలో తేలింది. రోడ్ నెం 45లో సోహైల్ రోడ్డు ప్రమాదం చేయగా.. ఈ ఘటన ఇద్దరు చనిపోగా..మరొకరు ఇప్పటికీ చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాదంలో కూడా మాజీ ఎమ్మెల్యే తన కొడుకు సొహెల్ తప్పించి మరొకరిని కేసులో చేర్చారు.
తాజావార్తలు
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?