NTV Telugu Site icon

Revanth reddy: నిరుద్యోగ నిరసనకు పిలుపు.. రేవంత్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌..

Revanthreddy, Addanki

Revanthreddy, Addanki

Revanth reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇవాళ, రేపు నిరుద్యోగ నిరసనకు పిలుపు నివ్వడంతో రేవంత్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ దీక్షకు వెళ్లేందుకు సిద్దమైన రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. రేవంత్‌ రెడ్డి ఇంటికి ఎవరికి అనుమతించడంలేదు. రేవంత్ ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. రేవంత్ ఇంటి వైపు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. రేవంత్ ఇంటి దగ్గర రెండు అంచల పటిష్ట భద్రత, బారికేడ్లు ఏర్పాటు చేశారు. రేవంత్ ఇంటి వైపు ఎవరిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే దీనిపై స్పందించిన అద్దంకి దయాకర్ రావు పేపర్ లీక్ విషయం పక్కన పెట్టి మాపై పడ్డారేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కాంగ్రెస్ నాయకులను హౌజ్ అరెస్ట్ లు చేయడం మతలబు ఏంటని మండిపడ్డారు.

టీఎస్పీఎస్సీ అక్రమాలపై ఇవాళ, రేపు ఉస్మానియా యూనివర్షిటిలో నిరసన దీక్ష చేపట్టేందుకు రేవంత్‌ రెడ్డి విద్యార్థులకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ అక్రమాలపై నిలదీయాలని విద్యా్ర్థుల జీవితాలతో ప్రభుత్వం చలగాటం ఆడతోందని 24, 25 తేదీల్లో టీఎస్పీఎస్సీ అక్రమాలపై దీక్షకు పిలుపు నిచ్చారు. అయితే రేవంత్‌ పిలుపుతో ఓయూ క్యాంపస్‌ అట్టుడుకింది. ఉదయం నుంచే జేఏసీ నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. ఓయూ క్యాంపస్‌ లో ఎవరికి అనుమతించడంలేదు. నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇవాళ ఓయూ నుండి గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు జేఏసీ ప్రయత్నించడంతో.. పోలీసులు అడ్డుకుని అదుపులో తీసుకున్నారు. దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్యద్యోగ మార్చ్‌కు జేఏసీ పిలుపు మేరకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు. మరో పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా జేఏసీ నాయకులను అదుపులో తీసుకున్నారు. దీంతో నేడు, రేపు క్యాంపస్ లో హై అలెర్ట్ ప్రకటించింది.

Read also: Kakani Govardhan Reddy: క్రాస్ ఓటింగ్ చేసిన వారికి శిక్ష తప్పదు

నిన్న సిట్‌ ముందు హాజరైన రేవంత్‌ రెడ్డి టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయిందని అన్నారు. ఒకటి కాదు… అరడజను ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టమైపోయిందన్నారు. రోజుకో దారుణం బట్టబయలవుతోందన్నారు. ఇద్దరితో మొదలై 20 మందికి చేరిందని అన్నారు. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచిందని అన్నారు. తప్పును ఎత్తి చూపడమే నేరమట అంటూ ఎద్దేవ చేశారు. ఆరోపణల గురించి ప్రస్తావించ కూడదట, అన్యాయాన్ని నిలదీయకూడదట, సమాధానం చెప్పమని పిలిచింద అంటూ రేవంత్‌ పేర్కొన్నారు. వెనక్కు తగ్గేదే లేదు. సిట్ కు సమాధానం చెబుతా సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా అన్నారు. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా అన్నారు రేవంత్‌ రెడ్డి.
Rishi Sunak : ఇంగ్లండ్ క్రికెటర్ వలలో బ్రిటన్ ప్రధాని.. అంతా అతని వల్లే..?