NTV Telugu Site icon

Police High Alert: మళ్ళీ మావోయిస్టుల అలజడి… కూంబింగ్

Maoists 1

Maoists 1

తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైందా?
తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యారా?
గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా పోలీసులు ఎందుకు అప్రమత్తం అయ్యారు?

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాపకింద నీరులా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని, మావోయిస్టుల చర్యలను తింపికొట్టేందుకు ముందస్తుగా పోలీసులు గోదావరి పరివాహక ప్రాంతాలలో కూంబీంగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో మహదేవపూర్,పలిమెల,మహాముత్తారం,మల్హార్ ,కాటారం మండలాలలో పోలీసులు నిత్యం వాహన తనిఖీలు, కార్డన్ సెర్చ్,కల్వర్ట్ తనిఖీ, పెట్రోలింగ్ నిర్వహిస్తూ, అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు.ఈ నెల 1 న మహాముత్తారం మండలం పెగడపల్లి,కనుకునూర్ గ్రామాలలో ప్రధాన రహదారులపై మావోయిస్టులు కరపత్రాలు వదిలి వెళ్లడం కలకలం రేపాయి. మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మిలటరీ ఇన్ ఛార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచరించినట్లు తెలుస్తోంది.

అలాగే డబ్బుల కోసం మల్హార్ మండలంలోని ఓ కంపెనీ నిర్వాహకులను కలిసినట్లుగా సమాచారం. పలిమెల మండలం నీలంపల్లి,ముకునూర్ అటవీ ప్రాంతాల్లో తన దళం 11 మంది సభ్యులతో సంచరిస్తున్నాడనే సమాచారంతో గ్రే హౌండ్స్, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు.ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలేస్తున్నారు. గోదావరి తీరం ఫెర్రీ పాయింట్లపై ఖాకీలు కన్ను వేశారు. మంగళవారం మహాముత్తారం మండలంలోమంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పర్యటనకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజాప్రతినిధులు తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలలో పర్యటించే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మాజీ మావోయిస్టులను ఠాణాకు పిలిపించి పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తూ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తుంది.

Gujarat: సమసిన వివాదం.. ఒకే స్టేజీపై రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్

Show comments