Haripriya Naik: రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యేలు హరి ప్రియ నాయక్ నియోజక వర్గంలో ధర్నాలో పాల్గొన్నారు. అయితే, హరిప్రియా నేతృత్వంలో ధర్నా కార్యక్రమం జరగడంతో ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎవరు బీఆర్ఎస్ ఇచ్చిన నిరసనల్లో పాల్గొనేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
Read Also: IND vs NZ 2nd Test: రిషబ్ పంత్ ఆడితే.. కేఎల్ రాహుల్ తప్పుకోవాల్సిందే!
అయితే, అంతకు ముందు రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత రోజే.. పార్టీ అధిష్టానం రైతు భరోసా ధర్నాకి పిలుపునిచ్చింది. కానీ, ఉమ్మడి ఖమ్మంలో ఎక్కడ కూడా ముఖ్యమైన కారు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొనలేదు. ఇల్లందులో మాత్రం మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పాటు తెలంగాణ సర్కార్ ను కించపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారని ఆ నిరసనలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.