ప్రధాని మోదీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో బసకు ఏర్పాటు చేసారు అధికారులు. మోడీ రాకకు ముందుగా నిన్న (బుధవార)మే హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందాలు నోవాటెల్ హోటల్‌లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న సందర్భంగా.. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు.
కాగా.. రాజ్‌భవన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్‌ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారుతాయని నిఘా వర్గాలు తెలిపారు. దీంతో.. ఎస్పీజీ సూచన మేరకు నోవాటెల్‌లోనే ప్రధాని బసను ఖరారు చేసినట్టు తెలిసింది. అయితే.. 2004వ సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన అప్పటి ప్రధాని వాజ్‌పేయి లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతం లోని ఓ స్టార్ హోటల్‌లో బస చేశారు. కాగా.. ప్రధాని మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సమావేశం జరిగే హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి వస్తారు. అక్కడనుంచి సమావేశం తర్వాత పక్కనే ఉన్న నోవాటెల్ హోటల్‌లో బసచేస్తారు. అయితే.. మొత్తం 288 గదులున్న ఈ హోటల్‌లో ప్రధాని బస కోసం ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వు చేసారని, బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్ మొత్తాన్ని బుక్ చేశారని హోటల్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
Telangana: కటౌట్లు, ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైర్.. పెనాల్టీ విధింపు
