NTV Telugu Site icon

MP Navneet Kaur: కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ నవనీత్‌ కౌర్‌పై కేసు నమోదు..

Mp Navneet Kaur

Mp Navneet Kaur

MP Navneet Kaur: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నవనీత్ కౌర్‌పై పోలీసులు కేసు నమోదు అయ్యింది. ఇటీవల మహబూబ్ నగర్ బీజేపీ ఎంపి అభ్యర్థి డీకే అరుణ తో కలిసి షాద్ నగర్ పట్టణం లో కార్నర్ మీటింగ్ లో నవనీత్ కౌర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కి వేసినట్లే అని చేసిన వ్యాఖ్యల పట్ల కేసు నమోదు అయింది. విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు షాద్ నగర్ పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఈనెల 8న హైదరాబాద్‌లో ఎంపీ అభ్యర్థి మాదవీలత తరపున ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read also: Jolly LLB 3 : న్యాయమూర్తుల ప్రతిష్టను దిగజార్చేలా ఉంది.. ఆ సినిమాను నిషేధించండి

15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని అక్బరుద్దీన్ చెబుతున్నాడు. అక్బరుద్దీన్ కు నేను సవాల్ విసురుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు అన్నారు. ఆ 15 సెకన్లలోనే మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదంటూ నవనీత్ రాణా హైదరాబాద్‌లో ప్రచారం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నవనీత్ కౌర్ మాటలకు ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని ఎంఐఎం చీఫ్ సవాల్ విసిరారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతుంది.

Read also: Jolly LLB 3 : న్యాయమూర్తుల ప్రతిష్టను దిగజార్చేలా ఉంది.. ఆ సినిమాను నిషేధించండి

కాగా.. నవనీత్ రాణా ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని AIMIM డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, నవనీత్ రాణా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు. కాగా.. 2012లో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే తప్పితే లెక్కలు సరిచేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన నవనీత్ కౌర్.. 15 నిమిషాలు అంటున్నారా.. పోలీసులు వెళ్లిపోతే మాకు 15 సెకన్లు చాలు.. ఏం జరుగుతుందని మీ సోదరులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆమె వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. నేను మోదీజీకి చెబుతున్నా… ఆమెకు 15 సెకన్లు కాదు గంట సమయం ఇస్తున్నాం… ఏం చేస్తుంది? మీలో మానవత్వం మిగిలి ఉందా లేదా అని మేము చూడాలనుకుంటున్నాము. ఇక్కడ ఎవరికీ భయం లేదా? మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Bandi Sanjay: నీ మెడలు వంచి.. ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే.. కేసీఆర్ పై బండి సంజయ్‌ ఫైర్‌