దుండగుల చేతిలో హత్యకు గురైన జెడ్పీటీసీ శెట్టె మల్లేశం మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా గుర్జకుంటకు తరలించారు. మల్లేశం హత్య నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చేర్యాల జెడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండంలం గుజ్జకుంటలో సంచలనంగా మారింది. వాకింగ్ కు వెళ్తుండగా గొడ్డళ్లు, కత్తులతో దాడి దుండగులు చేశారు.