NTV Telugu Site icon

Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్‌ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!

Toll Plaza Hevy Trafic

Toll Plaza Hevy Trafic

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన పండుగను టక్కున సంక్రాంతి అంటారు. సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది. భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు. బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది. ఈ మూడు రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మరికొద్ది గంటల్లో భాగ్యనగరం కళకళలాడబోతోంది. ఇప్పటికే ఇళ్లకు వెళ్లిన వారంతా తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు.

Read also: South Indian Super Heroes: వీళ్లు మన సినిమా సత్తా తెలిసేలా చేసారు…

సూర్యాపేట, ఘాట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఘట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 బూతులకుగానూ 6 బూతులను హైదరాబాద్ వైపు తెరిచారు టోల్ ప్లాజా సిబ్బంది. వాహనాల రద్దీ పెరిగితే మరో 2 బుతులని తెరవనున్నారు. ఇక 10 ఫాస్టాగ్ ఎంట్రీ ఉండగ రెండు బూతులు మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు. జనగామ, వరంగల్- నిజామాబాద్, సిద్దిపెట్, విజయవాడ, కర్నూల్ ఘట్ కేసర్ టోల్ ప్లాజా మీదుగా వాహనాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి.

Read also: JaggaReddy: ఎమ్మెల్సీ అభ్యర్డుల బీఫార్మ్ లపై సంతకం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

ఇక సూర్యపేట వద్ద రద్దీ ఎర్పడటంతో.. దీనిని నివారించి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లేవారు మరిపెడ, తొర్రూరు, జనగామ మార్గం మీదుగా లేదా వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండటమే కాకుండా జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి సందర్భంగా ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చే దారిలో టోల్ గేట్లు, జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వందలాది వాహనాలు టోల్ గేట్ల వద్ద బారులు తీరుతాయి. ముఖ్యంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతుంది.

Read also: Power Cuts in Hyderabad: హైదరాబాద్ లో విద్యుత్ కోతలు.. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు..!

ఖమ్మం పట్టణం నుంచి హయత్ నగర్ వరకు ఈ ట్రాఫిక్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ పెరిగిందని పోలీసులు తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టోల్ గేట్లను దాటడానికి దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది.
హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న పంతంగి టోల్ గేట్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి అధికారులే కాదు, ట్రాఫిక్ అధికారులు కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే 10 అదనపు గేట్లను ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు జాతీయ రహదారులన్నీ ప్రైవేట్ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మరి.. ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్నారా? అయితే మరిపెడ, తొర్రూరు, జనగామ రూట్ మీదుగా నగరానికి వచ్చి.. వరంగల్ మీదుగా.. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్రయాణించేలా ప్లాన్ చేసుకోండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా దీన్ని షేర్ చేయండి.. వారిని కూడా హెచ్చరించండి.
Shamshabad: పొగమంచు ఎఫెక్ట్‌.. విమానాలు ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన..

Show comments