NTV Telugu Site icon

Pocharam Srinivas Reddy: బీఆర్‌ఎస్‌ కు షాక్‌.. కాంగ్రెస్‌ లోకి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి..

Pocharam Revatnh Reddy

Pocharam Revatnh Reddy

Pocharam Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డితో కాంగ్రెస్ లోకి చేరడంతో బీఆర్ఎస్ కు పెద్ద షాక్‌ తగిలింది. ఈ ఉదయం పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. వీరిద్దరు పోచారంతో భేటీ అయ్యారు. అనంతరం పోచారం నివాసానికి కాంగ్రెస్​ ఎంపీ బలరాం నాయక్​, కాంగ్రెస్​ నేతలు చేరుకున్నారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. అలాగే పోచారంను సీఎం రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పోచారం ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి.. సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. సహకరించాలని కోరామని తెలిపారు. పెద్దలుగా సహకరించాలని కోరామని తెలిపారు. దీంతో పోచారం స్పందించి హస్తం గూటికి చేరారు.

Read also: CM Revanth Reddy: కాంగ్రెస్​ లోకి రండి.. పోచారంను ఆహ్వానించిన సీఎం రేవంత్​

అనంతరం పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పడి పదేళ్లు పూర్తి అయ్యిందని తెలిపారు. రేవంత్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. రేవంత్ ని నేనే ఇంటికి ఆహ్వానించా అన్నారు. రైతు పక్షపాత నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. రైతుల కష్టాలు తీరాలని.. కాంగ్రెస్ లోకి వచ్చా అని తెలిపారు. ఆరు నెలల పాలన చూశామన్నారు. చిన్న వయసులోనే అన్ని సమస్యలు అవగాహన చేసుకుంటున్నారని తెలిపారు. రాజకీయంగా నేను ఏం ఆశించడం లేదన్నారు. రైతు బాగుండాలి అనేదే నాకు ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వానికి చేదోడు వాదోడు గా ఉంటా అని క్లారిటీ ఇచ్చారు. టీఆర్ ఎస్ కంటే ముందు నేను టీడీపీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందన్నారు. ఒక్కొక్కరి అభిప్రాయం.. ఒక్కోలా ఉంటుందన్నారు.
Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ షూటింగ్ అప్డేట్ వైరల్..