Site icon NTV Telugu

Pocharam Case : పోచారం కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మరో ఇద్దరు అరెస్ట్‌

Arrest

Arrest

Pocharam Case : పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీం సహా మరో ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న రాత్రి ఈ ముగ్గురు హైదరాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు వారిని రాచకొండ పోలీసులకు హ్యాండ్‌ఓవర్‌ చేశారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఈ కాల్పుల కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను పోలీసులు నేడు మీడియా ముందుకు తీసుకురానున్నారు.

వివరాల ప్రకారం.. బాధితుడు ప్రశాంత్‌ సోను గత పది రోజుల్లో నాలుగు సార్లు గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నాడు. దీనివల్ల ఆ గ్యాంగ్‌పై అతనికి శత్రుత్వం ఏర్పడింది. ఇబ్రహీం అనే వ్యక్తి శ్రీనివాస్‌ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్‌కు ఫోన్‌ చేసి, పోచారం ప్రాంతానికి రమ్మని పిలిపించుకున్నాడు. అక్కడే హత్యాయత్నానికి ప్రణాళిక వేసి, కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

ఇబ్రహీం అండ్‌ గ్యాంగ్‌ ప్రశాంత్‌ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఈ దాడి జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఇబ్రహీంపై ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే గోవుల అక్రమ రవాణా కేసు నమోదై ఉంది. ప్రస్తుతం రాచకొండ పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న మిగతా వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Bihar Elections: ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్.. కాసేపట్లో ఉమ్మడి ప్రకటన

Exit mobile version