Site icon NTV Telugu

PM Modi : తెలంగాణలో కుటుంబపాలన చేసేవారు దేశద్రోహులు..

Modi Tour

Modi Tour

ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. అయితే ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. టీఆర్‌ఎస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మోడీ మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని.. అలాంటి త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసమో కాదన్నారు. టీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీ అంటూ మోడీ ఫైర్‌ ఆయ్యారు. తెలంగాణలో కుటుంబ పాలన చేసేవారే దేశద్రోహులు అని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలని ఆయన కార్యకర్తల, నేతలకు పిలుపునిచ్చారు. కుటుంబ పార్టీలు ఎలాంటి స్వలాభాలు చూసుకుంటారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. అంతేకాకుండా.. టీఆర్‌ఎస్‌ పాలన అంతా అవినీతిమయమన్న మోడీ.. తెలంగాణలో మార్పు తథ్యం అని అన్నారు. గతంలో జరిగిన ఎన్నికలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయన్న మోడీ.. తెలంగానలో బీజేపీ రావడం ఖాయమన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాల పేరు పెడుతున్నారని, పథకాల్లో రాజకీయం చేస్తే ప్రజలు నష్టపోతారన్నారు.

Exit mobile version