Site icon NTV Telugu

Vijaya Reddy: కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్‌ తనయ విజయారెడ్డి

Vijaya Reddy

Vijaya Reddy

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి షాకిచ్చిన ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌, పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి.. ఇవాళ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేశారు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరుల నేతల సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. విజయారెడ్డి, ఇక, విజయారెడ్డికి పార్టీ కండువా కప్పి.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు రేవంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదని.. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి ఉందన్నారు విజయారెడ్డి.

Read Also: Galla Aruna Kumari: నా రాజకీయ జీవితం ముగిసింది.. కానీ టీడీపీకే మద్దతు

పీజేఆర్‌ బిడ్డగా నాకు ఆశీర్వాదం ఇచ్చారు.. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.. ఇక, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విజయారెడ్డి.. పెన్షన్ కోసం.. రేషన్ కార్డ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకు ఇవ్వాలి… కానీ, అది టీఆర్‌ఎస్‌ పార్టీలో లేదని ఆరోపించారు.. అందరి పక్షాన పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం అంటూ పిలుపునిచ్చారు విజయారెడ్డి.

Exit mobile version