Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. ఈకేసును బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చారు. ఈ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే. అయితే ఈ మార్పునకు గల కారణాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని సమాచారం. కొందరు పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Read also: Intelligence Report: కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ సమయంలో దాడులు జరిగే ఛాన్స్..
ఫోన్ ట్యాపింగ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ లాకర్ రూమ్ ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారత్ వచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసింది. జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉండగా.. ఓ వైపు రెడ్ కార్నర్ నోటీసులు, మరోవైపు కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల విచారణకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ నెల చివరి వారంలో ప్రభాకర్ రావు ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతున్న విశ్వనీయ సమాచారం. అయితే ఈ వార్తలో ఇంకా క్లారిటీ రాలేదు. అతని కుటుంబ సభ్యులు ఇప్పటికే పలువురు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
Read also: Amit Shah : తొలి దశ ఓటింగ్ తర్వాత ఆందోళన.. విదేశీ ఏజెన్సీల సర్వేపై అమిత్ షా ఏమన్నారంటే
ప్రభాకర్ రావుతో పాటు 6వ నిందితుడిగా ఉన్న ఓ ఛానెల్ ఎండీ శ్రవణ్ కుమార్ విచారణ కూడా కీలకం కానుంది. దీంతో వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. వీరిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా సెక్షన్ 73 CrPC కింద ఆదేశించబడింది. దీంతో వారిని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియను పోలీసులు పూర్తి చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, ఇంటర్‌పోల్‌కు అందించబడింది. ఈ ప్రక్రియ పూర్తికాకముందే ప్రభాకర్ రావు ఇండియా వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ ఉన్నందున, ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే వారిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఈకేసు బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చడం సంచలనంగా మారింది.
