TG ECET Results: మరికాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG ECET Results: టీజీ ఈసెట్ ఫలితాలు మరొ కొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ప్రకటించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈసెట్ ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్ https://ecet.tsche.ac.in/ లాగిన్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చని చంద్రశేఖర్ వెల్లడించారు. టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 6న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ పరీక్షకు తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44, ఏపీలో 7 కేంద్రాలు మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
Read also: RR vs KKR: లీగ్ దశలో చివరి మ్యాచ్.. కేకేఆర్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా..
Also Read
మరోవైపు తెలంగాణలో PGESET-2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో PGECET రాత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఎ అరుణ కుమారి వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. PGESET పరీక్షలు జూన్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. జూన్ 9వ తేదీలోగా పరీక్షలు పూర్తి కావాలి. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. తెలంగాణ పీజీఈసెట్ రాత పరీక్షలు జూన్ 10 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 13న పూర్తవుతాయి. ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్ (టీఎస్ పీజీఈసెట్ 2024) నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి. పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
AP-Telangana Rains: ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!