NTV Telugu Site icon

Gurukula Exam: గురుకుల పరీక్షలో సాంకేతిక సమస్య..? ఇంకా స్టార్ట్ కాలే..!

Gurukul Eaxam

Gurukul Eaxam

Gurukula Exam: గురుకుల పీజీటీ ఇంగ్లీష్ ఆన్‌లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైదరాబాద్ హయత్ నగర్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. కానీ సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష ప్రారంభం కాలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద పరుగులు తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. దీంతో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద బైఠాయించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అభ్యర్థులు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అభ్యర్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు కూడా పరీక్షలు ఉంటాయి. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని అభ్యర్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Read also: Rahul Gandhi: పాంగాంగ్‌ సరస్సు వద్ద రాజీవ్‌గాంధీకి నివాళులర్పించిన రాహుల్‌

ఆగస్టు 1నుంచి 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఐబీ) ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.. ప్రతి పరీక్షకు రెండు గంటల వ్యవధితో ప్రతిరోజూ 8:30-10:30 AM, 12:30-2:30 PM మరియు 4:30-6:30 PM వరకు మొత్తం మూడు షిఫ్టులలో పరీక్షలు నిర్వహించబడతాయి. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల అభ్యర్థులతో పరీక్షలు ప్రారంభం కాగా, ఆ తర్వాత సబ్జెక్టుల వారీగా టీజీటీ, పీజీ టీ, డీఎల్, జేఎల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. PGT-1,276, TGT-4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్-2,876, TGT, స్కూల్ లైబ్రేరియన్- 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్-275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-226 సహా 9 కేటగిరీలలో ASC, ST, మైనారిటీ, BC ఉపాధ్యాయులు. 9,210 మ్యూజిక్ టీచర్ పోస్టులు-124 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ట్రిబ్ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. అన్ని పోస్టులకు కలిపి మొత్తం 2,63,045 దరఖాస్తులు వచ్చాయని ట్రైబ్ ఇప్పటికే వెల్లడించింది. చాలా పోస్టులు మహిళలకే కేటాయించారు. మొదటి సారిగా, ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో పరీక్షలను నిర్వహించాలని TRIB నిర్ణయించిన విషయిం తెలిసిందే..
Stock Market Opening: మార్కెట్‌లో మిశ్రమ ధోరణి.. స్వల్ప నష్టాల్లో సెన్సెన్స్