Holiday on January 22: జనవరి 22న అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశమే కాదు, ప్రపంచ హిందువులందరూ ఎదురుచూస్తున్నారు. ఇక శతాబ్ధాలుగా ఎదురు చూస్తున్న కల సాకారమవుతున్న మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనవరి 22న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఆఫ్ డే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని.. ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు హర్యానా, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, ఒడిశా, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో హాఫ్ డే అధికారికంగా సెలవు ప్రకటించారు.
Read also: Fake Passport and Visa: నకిలీ వీసా. పాస్పోర్టులు ముఠా.. సీఐడీ కేసు నమోదు..
ఈ క్రమంలో.. తెలంగాణలో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని శ్రీనివాస్ పిటిషన్‌లో కోరారు.ఇదిలా ఉండగా ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జనవరి 22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బండి సంజయ్ కోరారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. విగ్రహ సన్మాన కార్యక్రమంలో రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
IND vs BAN: టీమిండియా కెప్టెన్‌తో బంగ్లాదేశ్ క్రికెటర్ల గొడవ.. కొట్టుకునేంత పని చేశారు!