పుట్టా మధు… తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం.. తాజాగా మరోసారి పుట్టా మధు వార్తల్లోకి వచ్చారు. పత్రికలు, మీడియా సంస్థలకు సవాల్ చేశారు పుట్టా మధు. తనపై వచ్చిన ఆరోపణలు ఒక్కటి నిరూపించినా ఉరివేసుకుంటానని లేకపోతే మీ సంస్థలు మూసి వేసుకుంటారా అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి మీడియా పత్రికలపై పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆక్రోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనపై కొన్ని పత్రికలు కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఒక్కటైనా నిరూపించాయా అని ప్రశ్నించారు. టీవీ ఛానళ్లు రేటింగ్ కోసం నాపై అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
బ్రాహ్మణిజానికి మీడియా సంస్థలు పత్రికలు అమ్ముడుపోయాయనీ,నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే అంబేద్కర్ చౌరస్తా ముందు ఉరి వేసుకుంటా అన్నారు. ఒక్క మీడియా సంస్థ అయినా నేను తప్పు చేసినట్లు నిరూపించాలన్నారు. మంథని నియోజకవర్గంలో జరిగిన అనేక మరణాలపై నాపై పత్రికల్లో టీవీలో అనవసరమైన దుష్ప్రచారం చేశారని పేర్కన్నారు. నాకు 900 కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ పత్రికలు టీవీలు చూపించాయి, అవి ఎక్కడున్నాయో కనిపెట్టాలన్నారు. మంథని నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం, రౌడీయిజం ఎవరు చేశారో ఆలోచించాలన్నారు.పేపర్లకు టీవీలకు జ్ఞానం లేదనీ ,దొంగ రాతలు రాసే పత్రికలు చూపించే టీవీలను నమ్మకండి అని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read Also:
Etela Rajender: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. అదే కూలిపోతుంది
