CM Revanth Reddy: నేడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నిరుద్యోగ విజయోత్సవ భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రశంగించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లికి వెళ్లనున్నారు. సభ అనంతరం పెద్దపల్లి నుంచి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం కానున్నారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా పెద్దపల్లి వస్తున్నారు. దీంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
కాగా.. 9500 మందికి నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు.. సభ వేదికగా పదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. పెద్దపల్లి బైపాస్ నిర్మాణానికి జీవో నెంబర్ 912 తో 82 కోట్లు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం. ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కొత్త డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. స్వశక్తి మహిళ ప్రాంగణం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రంధాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం రామగుండం మంథని నియోజకవర్గంలో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇక సీఎం రేవంత్ భారీ బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు భారీగా తరలిరానున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. బహిరంగ సభ భద్రత కోసం రెండు వేల మంది పోలీసు సిబ్బందిని రామగుండం సీపీ ఏర్పాటు చేశారు. కాగా.. ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి.. ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే 54 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా.. 2025 డిసెంబర్ నాటికి మరో 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సమాచారం.
Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత పెళ్లికి హాజరుకాబోతున్న ముఖ్య అతిథులు వీళ్లే