Naga Chaitanya : హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ క్రమంలోనే చై, శోభితల పెళ్లి పనులు ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా హల్దీ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి హల్దీ వేడుకను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. చై, శోభితలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also:AP-TG Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో చై మూడుముళ్లు వేయనున్నారు. ఏఎన్నార్ ఆశీస్సులు ఉండాలనే భావనతోనే ఇరు కుటుంబాల పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. టాలీవుడ్ నుంచి దగ్గుబాటి, మెగా, నందమూరి ఫ్యామిలీలలోని అందరూ విచ్చేయనున్నారు.
Read Also:Rashmika : రష్మిక కోసం ఊహించని సాయం చేసిన విజయ్ దేవరకొండ
తాజాగా ఈ వివాహా వేడుకకు ఎవరెవరు? హాజరుకానున్నారనే విషయమై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు తెలిసింది. ఇక నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా తప్పక వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాజకీయం, పారిశ్రామిక రంగాలకు చెందిన కీలకమైన వ్యక్తులు ఈవేడుకలో భాగమవుతారని సమాచారం. ఈ వివాహం పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరుగుతుంది.