Road Accident: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబంలోని ఇద్దరు తండ్రి, కొడుకు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా గాంధీ నగర్ లో ప్రమాదం జరిగింది. సతీష్ అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ అతని 11 నెలల కుమారుడు సాత్విక్ కూడా చనిపోయాడు. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Sai Pallavi: ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
అయితే, బాధితులు గోదావరి ఖనిలోని హనుమాన్ నగర్ కు చెందిన సతీశ్, సాత్విక్ గా గుర్తించారు. సతీశ్ భార్య, అక్క, బావలు తీవ్రంగా గాయపడ్డారు. వారికి కరీంనగర్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇక, సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు..