Peanut Stuck: ప్రాణం మీదకు తెచ్చిన పల్లీ.. ఊపిరితిత్తుల్లో ఇరుక్కుని ఆసుపత్రిలో చేరిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peanut Stuck: గొంతులో రూపాయి కాయిన్ ఇరుక్కుందనో, కొబ్బరి ముక్క ఇరుక్కుందనో మనం ఎక్కు సార్లు వింటుంటాము. కానీ ఇక్కడ ఆరెండు కాదండోయ్ ఒక చిన్ని పల్లీ ముక్క ఇరుక్కుని ఓ మహిళ నరకయాతన అనుభవించింది. పల్లీలు ఆరోగ్యానికి మంచిది అంటుంటారు అలాంటి అదే హాని కలిగిందంటే నమ్మలేని నిజం. ఓ మహిళ పల్లీలు ఒకపక్కనుంచి తింటూ ఉండగా అది కాస్త ఊపిరి తిత్తుల్లో వెళ్లి అడ్డం పడటంతో ఆమె ఊపిరి ఆడక ఆసుపత్రి పాలైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇది విన్న వారందరూ షాక్ కు గురవుతున్నారు. ఇంత చిన్న పల్లీ ముక్క ప్రాణాలమీదకు తెచ్చిందా అంటూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏమి తినాలన్నా భయంతో జంకుతున్నారు.
Read also: Raviteja: ‘టైగర్ డెన్’ సెట్ వర్క్ గ్రాండ్ గా ఉంది…
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్‌పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ఏం జరిగింది..
హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన విజయలక్ష్మి అనే మహిళకు రోజూ వేయించిన వేరుశెనగలు తినడం అలవాటు. అయితే కొద్ది రోజుల క్రితం వేరుశెనగ తింటుండగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. ఆమె ఓ పక్కకి ఒరిగిపోయి మాటలు పల్లీలు తింటూ ఉండగా.. అది పొరపాటున ఊపిరితిత్తుల్లోని పై పొరల్లోకి వెళ్లిపోయింది.
అది గమనించిందో లేదో కానీ ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే దగ్గు, జ్వరం, ఆయాసంతో ఇబ్బంది పడింది. వైద్యుడి వద్దకు వెళ్లగా.. న్యుమోనియాగా భావించి చికిత్స ప్రారంభించాడు. మందులు వాడుతున్నా ఈ లక్షణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విజయలక్ష్మి నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్‌లో ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ కిషన్‌ను సంప్రదించారు. ఆమె లక్షణాలు, మాట్లాడుతున్న తీరుపై అనుమానం వచ్చిన వైద్యుడు వెంటనే సీటీ స్కాన్ చేయగా అది బాగానే ఉంది. దీంతో ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మధ్య ఏదో ఇరుక్కుపోయిందని తేలింది. ఇది న్యుమోనియాకు దారితీసిందని నిర్ధారించారు. అలాగే ఉండిపోతే ప్రాణాలకే ప్రమాదం.అడ్డంకిని తొలగించడానికి బ్రోంకోస్కోపీ జరిగింది. కానీ అది వేరుశెనగ అని తేలడంతో డాక్టర్‌తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. లేదంటే ఇలాగే చనిపోయే అవకాశం ఉందన్నారు.
Leo: ఆడియో లాంచ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం… లేని ఈవెంట్ కి బ్లాక్ లో టికెట్స్
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..