Leo: ఆడియో లాంచ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం… లేని ఈవెంట్ కి బ్లాక్ లో టికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘లియో’ పై భారీ అంచనాలున్నాయి. మాస్టర్ సినిమాతో మెప్పించలేకపోయిన ఈ కాంబో… లియోతో ఆ లోటును తీర్చడానికి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కాస్త తేడా కొడుతున్నా… లోకేష్ పై ఉన్న నమ్మకం లియోని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా గ్రాండ్‌గా ఆడియో,ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేడుక కోసం దళపతి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కానీ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ… లియో ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సెవన్ స్క్రీన్ స్టూడియో ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
Considering overflowing passes requests & safety constraints, we have decided not to conduct the Leo Audio Launch.
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
In respect of the fans' wishes, we will keep you engaged with frequent updates.
P.S. As many would imagine, this is not due to political pressure or any other…
— Seven Screen Studio (@7screenstudio) September 26, 2023
ఈవెంట్ పాసుల కోసం ఊహించిన దానికంటే ఎక్కువగా రిక్వెస్ట్స్ రావడం, ఆల్రెడీ బ్లాక్ లో ఈవెంట్ పాస్ లని ప్రింట్ చేసి బ్లాక్ మార్కెట్ వర్గాలు అమ్ముకోవడం, భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఈవెంట్ రద్దు చేస్తున్నామని వివరణ ఇచ్చారు కానీ కోలీవుడ్ వర్గాల్లో మాత్రం మరోలా ప్రచారం జరుగుతోంది. రాజకీయపరమైన ఒత్తిడుల వల్లే ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అలాంటి వార్తల్లో నిజం లేదని అన్నారు. అయినా కూడా దీని వెనక కోలీవుడ్ హీరో, డీఎంకే మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ హ్యాండ్ ఉందని అంటున్నారు. ఆయనకు సంబంధించిన రెడ్ జెయింట్స్ సంస్థకు లియో రైట్స్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!