NTV Telugu Site icon

Peanut Stuck: ప్రాణం మీదకు తెచ్చిన పల్లీ.. ఊపిరితిత్తుల్లో ఇరుక్కుని ఆసుపత్రిలో చేరిన మహిళ

Peanut Stuck

Peanut Stuck

Peanut Stuck: గొంతులో రూపాయి కాయిన్ ఇరుక్కుందనో, కొబ్బరి ముక్క ఇరుక్కుందనో మనం ఎక్కు సార్లు వింటుంటాము. కానీ ఇక్కడ ఆరెండు కాదండోయ్ ఒక చిన్ని పల్లీ ముక్క ఇరుక్కుని ఓ మహిళ నరకయాతన అనుభవించింది. పల్లీలు ఆరోగ్యానికి మంచిది అంటుంటారు అలాంటి అదే హాని కలిగిందంటే నమ్మలేని నిజం. ఓ మహిళ పల్లీలు ఒకపక్కనుంచి తింటూ ఉండగా అది కాస్త ఊపిరి తిత్తుల్లో వెళ్లి అడ్డం పడటంతో ఆమె ఊపిరి ఆడక ఆసుపత్రి పాలైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇది విన్న వారందరూ షాక్ కు గురవుతున్నారు. ఇంత చిన్న పల్లీ ముక్క ప్రాణాలమీదకు తెచ్చిందా అంటూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏమి తినాలన్నా భయంతో జంకుతున్నారు.

Read also: Raviteja: ‘టైగర్ డెన్’ సెట్ వర్క్ గ్రాండ్ గా ఉంది…

ఏం జరిగింది..

హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన విజయలక్ష్మి అనే మహిళకు రోజూ వేయించిన వేరుశెనగలు తినడం అలవాటు. అయితే కొద్ది రోజుల క్రితం వేరుశెనగ తింటుండగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. ఆమె ఓ పక్కకి ఒరిగిపోయి మాటలు పల్లీలు తింటూ ఉండగా.. అది పొరపాటున ఊపిరితిత్తుల్లోని పై పొరల్లోకి వెళ్లిపోయింది.
అది గమనించిందో లేదో కానీ ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే దగ్గు, జ్వరం, ఆయాసంతో ఇబ్బంది పడింది. వైద్యుడి వద్దకు వెళ్లగా.. న్యుమోనియాగా భావించి చికిత్స ప్రారంభించాడు. మందులు వాడుతున్నా ఈ లక్షణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విజయలక్ష్మి నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్‌లో ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ కిషన్‌ను సంప్రదించారు. ఆమె లక్షణాలు, మాట్లాడుతున్న తీరుపై అనుమానం వచ్చిన వైద్యుడు వెంటనే సీటీ స్కాన్ చేయగా అది బాగానే ఉంది. దీంతో ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మధ్య ఏదో ఇరుక్కుపోయిందని తేలింది. ఇది న్యుమోనియాకు దారితీసిందని నిర్ధారించారు. అలాగే ఉండిపోతే ప్రాణాలకే ప్రమాదం.అడ్డంకిని తొలగించడానికి బ్రోంకోస్కోపీ జరిగింది. కానీ అది వేరుశెనగ అని తేలడంతో డాక్టర్‌తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. లేదంటే ఇలాగే చనిపోయే అవకాశం ఉందన్నారు.
Leo: ఆడియో లాంచ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం… లేని ఈవెంట్ కి బ్లాక్ లో టికెట్స్