Site icon NTV Telugu

మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్‌కే నా సవాల్..

మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్‌ చివరకు సీఎం కేసీఆర్‌ పైకి మళ్లింది… గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. మల్లా రెడ్డిపై మరోసారి భూ కబ్జా, అవినీతి, అక్రమ ఆరోపణలు చేశారు.. ఈ సందర్భంగా ఇవిగో ఆధారాలంటూ కొన్ని పత్రాలను కూడా బయటపెట్టారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్‌పై స్పందించిన ఆయన.. సవాల్‌ మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్‌కే విసురుతున్నా అన్నారు.. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద కదా? అని ప్రశ్నించారు.. అది సెమీ ఫైనల్.. ఇక మిగిలింది ఫైనలే.. ఆ ఫైనల్‌ కేసీఆర్‌ మీదేనని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు.. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని కోరిన ఆయన.. కేసీఆర్‌కి చేతనైతే రావాలని డిమాండ్ చేశారు.

ఇక, కేటీఆర్‌ విమర్శలపై స్పందిస్తూ.. చంద్రబాబు చెప్పులు మోసి బతికిందే కేసీఆర్‌ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.. మరోవైపు.. కేటీఆర్… పేరే టీడీపీది అంటూ ఎద్దేవా చేసిన రేవంత్‌ రెడ్డి… కేటీఆర్‌.. రకుల్‌ రావు అని పెట్టుకో అంటూ కామెంట్ చేశారు.. కేసీఆర్‌, కేటీఆర్ కి సవాల్‌ విసురుతున్నా.. ముందస్తు ఎన్నికలకు రండి.. మేం మా బలం ఏంటో చూపిస్తాం అన్నారు.. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు కేటీఆర్‌ ఒప్పుకోకపోతే… సీఎం కేసీఆర్‌ రాజీనామా చేసి వచ్చినా.. గజ్వేల్ లో పోటీ చేస్తానన్నారు.. మేమేంటో మా బలం ఏంటో చూపిస్తాం.. టీఆర్ఎస్‌ గెలుస్తుందా..? కాంగ్రెస్‌ గెలుస్తుందా తేల్చుకుందాం అన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

Exit mobile version