NTV Telugu Site icon

కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తుంది.. రేవంత్‌రెడ్డి ఫైర్

Revanth Reddy

Revanth Reddy

కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.. గాంధీ భవన్‌లో జెండా ఎగరేసిన రేవంత్‌ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి అప్పటి ప్రధాని నెహ్రూ సహకరించారని తెలిపారు.. హోంమంత్రికి ప్రత్యేక నిర్ణయాలు ఉండవు.. ఆపరేషన్ పోలో నిర్ణయం నెహ్రూదేనని స్పష్టం చేశారు.. కానీ, కొందరు ఇది హోం మంత్రి నిర్ణయంగా చిత్రీకరిస్తున్నారన్న ఆయన.. కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు..

ఇక, మీ పార్టీలో ఉన్న స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉంటే వారి గురించి చెప్పుకోండి అంటూ బీజేపీ నేతలకు సలహా ఇస్తూ ఎద్దేవా చేశారు రేవంత్‌ రెడ్డి.. మా పార్టీ నాయకుల ఫోటోలు పెట్టుకుని లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించిన ఆయన.. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య.. కొమరం భీం లాంటి వాళ్లంతా నిజాంపై పోరాటం చేశారని గుర్తుచేశారు.. నిజాంపై పోరాటంలో హిందువులతో పాటు.. షోయబుల్లా ఖాన్ లాంటి వాళ్లు కూడా పాల్గొన్నారన్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ప్రజలు అప్రతంగా ఉండాలి.. మతాల మధ్య చిచ్చు పెట్టేప్రయత్నం జరుగుతోందన్నారు.