TPCC Chief Mahesh Goud: ఇక చాలు ఆపండి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్ విజ్ఞప్తి..
- సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి..
- ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ముగించండి..
- మంత్రి కొండా సురేఖ భేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు..
- కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Chief Mahesh Goud: సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ముగించాలని కోరారు. మంత్రి కొండా సురేఖ బేషరతుగా తను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇరువైపులా మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుందని పీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు.
Read also: Kishan Reddy: హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతుంది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Also Read
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలల్లో దుమారం రేపుతున్నాయి. నిన్న సమంత, నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మంత్రిపై విమర్శలతో ముంచెత్తింది. అధికారంతో అడ్డు అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్ధ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడ్ హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందించారు. ఓక మహిళా అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అనేది సదరు మంత్రి ఆలోచించుకోవాలని మండిపడుతున్నారు.
Read also: Jani Master-Bail: జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్!
అటు రాష్ట్ర రాజయాల్లోని ప్రముఖులు ఇటు సినిమా ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖ మాటలపై మండి పడుతున్నారు. మరోవైపు కాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, ఎన్టీఆర్, నాని, మోగాస్టార్ చిరంజీవి, ఆర్టీవీ, ప్రకాష్ రాజ్ సినీతారలు ఘటూగా, రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. సమంత.. నాగ చైతన్య వివాదం పై కొండా సురేఖతో స్వయంగా మాట్లాడి వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. అసలు ఎందుకు ఆ మాటలు వచ్చాయన్న దానిపై తెలుపాలన్నారు. రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీ వారి పేర్లను ప్రస్తావించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.
Azharuddin: మనీలాండరింగ్ కేసులో విచారణకు క్రికెటర్ అజారుద్దీన్‌కు సమన్లు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..