బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఆందోళన విరమించే దిశగా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని పవన్ కోరారు.
గత కొద్దిరోజులుగా బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Basar IIIT) విద్యార్ధులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో క్యాంపస్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కనిపించకుండా గేట్లకు రేకులను అడ్డు పెట్టారు. ఇతరులు ఎవరూ రాకుండా మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాసర రాకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కార్యకర్తలు రాకుండా అన్ని దారుల్లోనూ భద్రత ఏర్పాటు చేశారు. నాలుగో రోజూ శుక్రవారం కూడా నిరసనలకు సిద్దమయ్యారు. డిమాండ్ల విషయంలో విద్యార్థులు ఏమాత్రం పట్టువీడడంలేదు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన చేస్తామని వారు పట్టుదలగా వున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో క్యాంపస్ గేటు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నేతలెవరూ రాకుండా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకుముందే మంత్రి కేటీఆర్ ఆందోళన చేయవద్దని విద్యార్ధుల్ని కోరారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను సిల్లీ అనడం దుర్మార్గమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా?అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవిద్యార్థులను బెదిరించడం అరాచకం అన్నారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న సీఎంకు చీమకుట్టినట్టయినా లేదన్నారు.
Agnipath Scheme: అసలు అగ్నిపథ్ స్కీమ్ ఏంటి..?