NTV Telugu Site icon

Nizamabad News: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం

Nizamabad

Nizamabad

Nizamabad News: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. బయట నుంచి లిఫ్ట్ వరకు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిని తీరు అందరిని కలిచివేదసింది. తమ కొడుకు అనారోగ్యంతో వున్నాడని ఆసుపత్రిలో స్ట్రెచర్ కనిపించలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి సిబ్బందిని సహరించాలని కోరినా ఎవరు నోరుమదపలేదని అన్నారు.

దీంతో దిక్కుతోచని స్థితిలో రోగి కాళ్లు పట్టుకుని తీసుకొని వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చకు దారితీస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నిజామాబాద్‌ ఆస్పత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే  ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆసుపత్రిలో సరైన వసులులేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు మండిపడుతున్నారు. అక్కడికి వెళ్లి వైద్యులు అందుబాటులో ఎవరూ ఉండని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో వైద్యులు, స్ట్రెచర్, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కూడా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్యాసింజర్ ఆటోల్లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అయితే ఈ పరిణామాలపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. మార్చి 31న పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారని.. చిట్టితో ఓపీ వచ్చేలోపు లిఫ్ట్ రావడంతో పేషెంట్‌ను తల్లిదండ్రులు లాక్కెళ్లారని తెలిపారు. 2వ అంతస్తుకు చేరుకున్న రోగిని వీల్ చైర్ లోనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఏం జరిగిందో తెలియని ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదే జరిగింది కానీ ఇంకేదో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకూడదని విరించారు.

Show comments