తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్‌లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత టెన్షన్ పరిస్థితులు తలెత్తాయి.. పారామౌంట్ కాలనీ హాట్ స్పాట్‌గా మారిపోయిందా? అనే అనుమానాలు కలుగున్నాయి.. ఇక, ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయడం.. దాని రిపోర్టులు రావడంతో.. తర్వాత.. ఒమిక్రాన్ నిర్ధారణకు శాంపిల్స్ పంపించడం లాంటి ప్రాసెస్‌కు టైం పడుతుండడంతో.. అక్కడ ఇంకా ఎన్ని కేసులు నమోదు అవుతాయో అనే టెన్షన్ మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది.
Read Also: భట్టి టూర్ వాయిదా.. ఏఐసీసీతో రేవంత్, భట్టి భేటీ రద్దు..
ఇక, తెలంగాణలో నిన్న కొత్తగా నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇవాళ మరో కొత్త కేసు వెలుగు చూసింది.. నిన్నటి కేసుల్లో ముగ్గురు కెన్యా నుంచి, ఒకరు దుబాయ్ నుండి వచ్చిన ఇండియన్స్.. కెన్యా నుండి వచ్చిన ముగ్గురు టోలీచౌకీ పారమౌంట్ కాలనీలో నివాసం ఉంటుండగా.. దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి చార్మినార్ దగ్గర నివాసం ఉంటారు.. ప్రస్తుతం ఆ నలుగురినిటీమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. చార్మినార్ వాసి అయిన దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి ట్రీట్‌మెంట్ కోసం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి పలుమార్లు వెళ్లినట్టుగా తెలుస్తోంది.. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అందరినీ కాంటాక్ట్ ట్రెసింగ్‌లో పెడుతున్నారు. కాగా, ఇప్పటికే పారామౌంట్ కాలనీని కంటైన్మెట్ జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.