రాజీనామా చేసేఉద్దేశం లేదు: జగ్గారెడ్డి

రాజీనామా అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొట్టిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. పీఏసీ భేటీలో తన ఆవేదనని మాణిక్కం ఠాగూర్‌కి చెప్పానని తెలిపారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీని కలుస్తానని తెలిపారు.

Read Also: ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్ర: జీవీఎల్‌

తన స్టాండ్ ఎప్పుడూ కాంగ్రేసేనని స్పష్టం చేశారు. తన వల్ల ఎవరికైనా ఇబ్బందైతే.. ఇండిపెండెంట్‌గానే ఉంటానని, ఏ పార్టీలోకి వెళ్లనని జగ్గారెడ్డి చెప్పారు. అంతేకాకుండా సోనియా గాంధీని కలుస్తారా అన్న ప్రశ్నకు ఎవ్వరైనా కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలవొచ్చని ఎవ్వరికి ఇబ్బంది ఉంటే వారు కలుస్తారని ఈ సందర్భంగా జగ్గారెడ్డి వెల్లడించారు.

Related Articles

Latest Articles