Site icon NTV Telugu

Kaushik Reddy: తిట్టడం కాదు.. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి..

Padi Koushik Reddy

Padi Koushik Reddy

Kaushik Reddy: తిట్లు తిట్టడం కాదు మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేలు పాడి కౌషిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో ఎక్కడైన ఒక్క ఉద్యోగం ఇచ్చి ఉంటె నా ముక్కు నెలకు రాస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. క్రొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డీ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఈ రోజు ఫిబ్రవరి 1 ..కాంగ్రెస్ జాబ్ కేలెండర్ ప్రకారం ఈ రోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఏమైంది రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.

Read also: Rakul Preet Singh: రెడ్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ అందాల హొయలు

ఏమైనా మతిమరుపు వచ్చిందా ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేస్తా అన్నది చేయడం లేదు ..మేము చేసినవి రేవంత్ తన ఖాతాలో వేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావుకు నీకు పోలికా ? అంటూ మండిపడ్డారు. హరీష్ రావు ఉదయం 6 గంటల నుంచి పని మొదలు పెట్టి రాత్రి రెండు గంటల వరకు ప్రజల కోసమే పని చేస్తారని అన్నారు. హరీష్ రావు శ్రమ వల్లే నిన్న రేవంత్ ఇచ్చిన నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలు సాకారం అయ్యాయని తెలిపారు. రేవంత్, కేసీఆర్ హయంలో ఏం జరగలేదంటే నిన్నటి కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేవారా ? అని గుర్తు చేశారు. తిట్లు తిట్టడం కాదు మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు రేవంత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Malla Reddy: నేను.. రేవంత్ మిత్రులం.. కలిస్తే తప్పేంటి..!

Exit mobile version