NTV Telugu Site icon

Congress PAC: పీఏసీ కన్వీనర్ సమావేశం.. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తీర్మానం

Congress Pac Meeting

Congress Pac Meeting

గాంధీభవన్‌లో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం పార్లమెంటు ఎన్నికలు, ఇతర కీలక అంశాలపై పీఏసీ చర్చించి నిర్ణయించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించినట్టు పీఏసీ పేర్కొంది.

Also Read: Big Shock: నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు బిగ్ షాక్

పీఏసీ సమావేశం అనంతరం పీఏసీ ‍కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కమిటీ మూడు తీర్మానాలు చేశామన్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని తీర్మానం చేశామన్నారు. అలాగే ఆరు గ్యారంటీలపై చర్చించామని, అందులో రెండు ఇప్పటికే అముల చేశామన్నారు. మిగిలిన వాటిని ఎలా అమలు చేస్తారనేది అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తామన్నారు. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్‌ ఇస్తారన్నారు.

Also Read: CM YS Jagan: ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న సీఎం జగన్‌ వరుస భేటీలు

తెలంగాణ చేపట్టిన ప్రాజెక్ట్‌ల అవకతవకలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమీక్ష చేపట్టారని, ప్రాజెక్ట్‌ల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని, సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని తీర్మానం చేశామని వెల్లడించారు. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్‌ నుంచి పోటీ చేశారని, త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే, ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక్కో మంత్రికి ఇంఛార్జి భాధ్యతలు ఇస్తామని, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.