Osmania University Vice Chancellor Ravinder About 82nd Convocation Day
ఉస్మానియా యూనివర్సిటీలో రేపు ఓయూ 82వ కాన్వకేషన్ డే ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కాన్వకేషన్ సందర్భంగా ఓయూ వీసీ రవిందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఓయూ 82 వ కాన్వకేషన్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాన్వకేషన్ కు ముఖ్య అతిథిలుగా జస్టిస్ ఎన్వీ రమణ… గవర్నర్ తమిళ సై పాల్గొంటారని ఆయన వెల్లడించారు. రేపు సాయంత్రం 6 గంటలకు కాన్వకేషన్ ప్రారంభం అవుతుందని, రేపు ఓయూ 82వ స్నాతకోత్సవం సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకి ఓయూ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఓయూ చేత గౌరవ డాక్టరేట్ అందుకోనున్న ఐదవ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అని ఆయన తెలిపారు.
ఇప్పటికీ 47మందికి గౌరవ డాక్టరేట్లు ఓయూ ఇచ్చినట్లు, ఇప్పటికి లా డిపార్ట్మెంట్ లో 29, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ 12, సైన్స్ లో ఆరుగురికి గౌరవ డాక్టరేట్ ఓయూ అందించింది. 31మంది విద్యార్థులకు 55 గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నట్లు వీసీ రవీందర్ తెలిపారు. గోల్డ్ మెడల్స్ అందుకునే 31మందిలో నలుగురు అబ్బాయిలు, 27 మంది అమ్మాయిలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 260 మంది స్కాలర్స్ పీహెచ్డీ పట్టా అందుకోనున్నారని, పాస్ లు ఇచ్చిన విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఓయూ లోని ఠాగూర్ ఆడిటోరియంలో కాన్వకేషన్ ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.