Hyderabad: దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవ్వుతున్నారు. ఈసారి రూపాంతరం చేందిన మహ్మమ్మారి కోవిడ్ JN1గా తన ఉనికిని చాటుకుంటోంది. ఇది తేలికపాటి రూపాతంరం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదంటూ వైద్య నిపుణులు చెబుతుంటే మరోవైపు కొత్త వెరియంటూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. ఎలాంటి మరణాలు సంభవించిన కోవిడ్ వల్లే అంటూ దుష్పచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనా మరణించాడంటూ వార్తలు రాగా తాజాగా ఆస్పత్రి సూపరింటెంట్ నాగేందర్ దానిని కొట్టిపారేశారు. అతడిది కోవిడ్ మరణం కాదని, గుండె సంబంధిత సమస్యలతో చనిపోయాడని స్పష్టం చేశారు.
Also Read: Covid Cases : న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం గోవాకి వెళుతున్నారా?
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో కోవిడ్ కారణంగా మరణాలు సంభవించలేదు. ఒక రోగి Md. సుభాన్, 60 ఏళ్ల వ్యక్తి.. R/o బండ్లగూడ, దూద్‌బౌలి చెందిన వ్యక్తి. తీవ్రమైన ఎడమ జఠరిక పనిచేయకపోవడం (గుండె ఆగిపోవడం) టైప్ 2 శ్వాసకోశ వైఫల్యంతో COPD తీవ్రమైన సమస్యతో మెడికల్ ఎమర్జెన్సీతో మా అక్యూట్ మెడికల్ కేర్‌లో చేరారు. కోవిడ్‌కు యాదృచ్ఛికంగా జరిగిన పరీక్షలో అతడికి పాజిటివ్‌గా వచ్చింది. ఈ క్రమంలో డిసెంబర్ 24న తీవ్రమైన గుండె వైఫల్యం కారణంగా ఆ రోగి మరణించారు. అతడిది కోవిడ్ మరణం కాదు. ప్రస్తుతం ముగ్గురు రోగులు మా ఐసోలేషన్ వార్డులో వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్ అయ్యారు. కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించాము. ముగ్గురు రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’ ఆయన తెలిపారు.
Also Read: Farooq Abdullah: కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే పడుతుంది.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
