Operation Chirutha: మేకను ఎరేసినా ఫలితం శూన్యం.. 5వ రోజుకు చేరిన ఆపరేషణ్ చిరుత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Chirutha: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత 5వ రోజుకు చేరింది. దీంతో ఎయిర్ పోస్టు పరిసర ప్రాంతాల్లో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు బోన్ ఏర్పటు చేసి అందులో మేను ఉంచిన ఫలితం సూన్యం అయ్యింది. బోన్ వద్దకు వచ్చిన చిరుత మేకను చూసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుండటంతో అటవీ శాఖ అధికారులకు ఆపరేషన్ చిరుత పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే చిరుతను బంధించేందుకు 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. ట్రాప్ కెమెరాల్లో చిక్కిన చిరుత దృశ్యాలు కనిపించాయి. మేక ను ఎరగా వేసినా… బోను లోకి చిరుత రాకపోవడంతో అధికారులు చిరుతకోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో అధికారులు నాలుగు రోజులుగా చిరుతకోసం వేట మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో నీటి కుంట ఉండటంతో.. వేరే ప్రాంతానికి చిరుత వెళ్లడం లేదంటున్నారు అటవీ శాఖ అధికారులు.
Read also: Yarlagadda Venkat Rao: చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్‌పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు.
Big Saving Days Sale 2024: బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మోటో ఎడ్జ్ 40 నియోపై భారీ తగ్గింపు!
తాజావార్తలు
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్‌శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్‌లు వీరే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..