Sonu Sood: సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో టోకరా.. రూ.68వేలు దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో నటుడు సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో పేదలకు సహాయం అందించి రియల్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ వ్యక్తి తాజాగా రూ.68 వేలు దోచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీకి చెందిన పి.సంధ్య(36) అనే మహిళ బంధువుల్లో ఒకరికి కేన్సర్ చికిత్స కోసం డబ్బు అవసరమైంది. దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్విటర్లో సోనూసూద్ ఫౌండేషన్‌ను ఆశ్రయించింది.
Vikarabad: సెలవు ప్రకటించుకున్న డాక్టర్లు.. రోగుల అవస్థలు
Also Read
ఈ నేపథ్యంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను సోనూసూద్ ఫౌండేషన్ నుంచి కాల్ చేస్తున్నానంటూ సదరు మహిళకు ఫోన్ చేశాడు. బంధువు వివరాలు అడిగినట్లు అడిగి.. మొబైల్లో ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత ఫోన్‌పే యాప్‌లోకి వెళ్లి బ్యాంకు డెబిట్ కార్డును రెండు వైపులా స్కాన్ చేయాలని సూచించాడు. అయితే సదరు వ్యక్తి చెప్పినట్లే సంధ్య చేసింది. అనంతరం తమ ఫౌండేషన్ నుంచి డబ్బు పంపిస్తామని, మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలని వ్యక్తి సూచించాడు. సంధ్య తన మొబైల్‌కు వచ్చిన ఓటీపి చెప్పగానే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి మూడుసార్లుగా రూ.68వేలు బదిలీ అయ్యాయి. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి వివరాలను సేకరిస్తున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!