Site icon NTV Telugu

TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్

Tspsc

Tspsc

రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్‌ పూనుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీఎస్పీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 581 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ట్రైబల్, బీసీ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్ట్ లు, దివ్యాంగ్, సీనియర్ సిటిజన్ విభాగంలో వార్డెన్, మేట్రన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్సీఎస్సీ. మొత్తం 581 పోస్టులకు జనవరి 6, 2023 నుంచి జనవరి 27వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. వీటిలో హాస్టల్ వెల్ ఫేర్ గ్రేడ్ 1 అండ్ 2, మాట్రాన్ గ్రేడ్ – 1 అండ్ 2 , వార్డెన్ గ్రేడ్ 1 అండ్ 2, లేడీ సూపరింటెండెంట్, చిల్డ్రెన్ హోమ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also Read : Covid Alert: కరోనా కట్టడిపై కేంద్రం దృష్టి.. నేటి నుంచి విదేశీ ప్రయాణికులకు పరీక్షలు

హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) – 228, హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) -05, హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 106, హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) -70, హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140, వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05, -లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19, మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03, వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03, మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

Exit mobile version