TGPSC Group 1 Prelims: గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC Group 1 Prelims: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిన్న (జూన్ 9) ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. ఇక ఓఎంఆర్ పద్ధతిలో 895 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే.. లక్ష మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు గైర్హాజరు అయ్యారని అధికారులు వెల్లడించారు. కాగా.. అభ్యర్థులు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02 లక్షల మంది మాత్రమే హాజరయ్యారని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అంటే 74 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ 1 కింద 536 పోస్టులు ఉండగా ఒక్కో పోస్టుకు 536 మంది పోటీ పడనున్నట్లు తెలిపారు. దీంతో.. పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
Read also: CM Revanth Reddy: నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
కాగా.. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. గణిత నేపథ్యం ఉన్నవారు వీటికి సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు. సర్వేలు, నివేదికల నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఈసారి సాధారణ కటాఫ్ 75-80 మార్కుల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగడంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు.
Read also: Uttarpradesh : ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన 11 మంది
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షకు నలుగురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. అలాగే కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన సాయిప్రియ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కూనారం రైలు గేటు పడిపోవడంతో ఐదు నిమిషాలు ఆలస్యమైంది. అధికారులు అనుమతించకపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు మంథన్‌కు చెందిన ప్రసన్య పొరపాటున మరో స్నేహితురాలి హాల్‌టికెట్ తీసుకురాగా, అధికారులు ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.
Amaravati: అమరావతికి పూర్వ వైభవం..సంతోషంలో రైతులు
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!