Site icon NTV Telugu

కోటి డోసుల తెలంగాణ..

vaccination

vaccination

కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… మొదటల్లో ప్రజల్లో భయం ఉన్నా.. క్రమంగా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇక, వ్యాక్సిన్ల కొరతతో కొంత కాలం తెలంగాణలో వ్యాక్సిన్ వేయడమే నిలిపివేసిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్‌ చురుకుగా సాగుతోంది.. రాష్ట్రంలో నేటితో కోటి డోసులు పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఇప్పటి వరకు తెలంగాణలో 1,00,53,358 డోసుల వాక్సినేషన్ వేశామని… అందులో మొదటి డోసు తీసుకున్నవారు 86,06,292గా ఉంటే.. రెండో డోసు తీసుకున్నవారు 34,47,066గా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది.

Exit mobile version