Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
- నాగార్జున సాగర్‌లో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు..
- పట్టుబడ్డ ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్స్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు..
- సొంత పార్టీ వాళ్ళే చేయించారని పట్టుబడ్డ కౌన్సిలర్స్ మండిపాటు..
- రెండు గ్రూప్స్‌గా సాగర్ కాంగ్రెస్ కౌన్సిలర్స్, సోషల్ యుద్ధం..
- కౌన్సిలర్లు 8+3గా విడిపోయి రచ్చ రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల పేకాట పంచాయతీ పీక్స్‌కు చేరిందట. ఈ మున్సిపాలిటీ పరిధిలో పేకాట ఆడుతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా… పట్టుబడిన వారిలో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్స్, ఒక జెన్ కో ఉద్యోగి, మరో ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండటం కలకలం రేపింది. తాము పట్టుబడటం వెనక తమ పార్టీకే చెందిన కీలక నేత, సాగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజాప్రసాద్ హస్తం ఉందన్నది సదరు కౌన్సిలర్స్ డౌట్. దీంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెరిగి పార్టీలో రచ్చ మొదలైంది. సోషల్ మీడియా పోస్టుల వార్ శృతి మించడంతో.. ఈ పేకాట పంచాయితీ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి చేరింద. వెంటనే రంగంలో దిగిన ఎమ్మెల్యే అభ్యంతరకర పోస్ట్‌లన్నిటినీ డిలిట్ చేయించారట. పంచాయితీ ఏంటో తేల్చేందుకు ఆ ఇద్దరితో పాటు.. కాంగ్రెస్ కౌన్సిలర్లు 11 మంది తనను కలవమని ఆదేశించారు. ఆ ప్రకారం 8 మంది అటెండ్ అవగా…. వైస్ చైర్మన్ ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు డుమ్మా కొట్టారట. సరిగ్గా ఇక్కడే పార్టీలోని వర్గపోరు బయటపడింది. పేకాట ఆడుతూ పట్టుబడిన తర్వాత నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్లు 8+3గా విడిపోయారనడానికి ఇదే సాక్ష్యమని అంటున్నారు పరిశీలకులు.
వినాయక నిమజ్జనం రోజున ఏర్పాట్లను కూడా 8 మంది కౌన్సిలర్లు ఒకసారి… ముగ్గురు మరోసారి పర్యవేక్షించడం ఈ వాదనలకు బలాన్నిస్తోంది. నందికొండ మున్సిపాలిటీలో అధికార పార్టీ ఇలా చీలిపోవడానికి ప్రధాన కారణం పేకాట పంచాయితీయేనని చెప్పుకుంటున్నారు. ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో… నాగార్జునసాగర్ నియోజకవర్గం పేకాటకు అడ్డాగా మారిందన్న అభిప్రాయం బలంగా ఉంది. గతంలో కూడా పేకాట రాయుళ్ళను పోలీసులు అరెస్టులు చేయడం.. మరికొందరికి వార్నింగ్ ఇచ్చి వదిలేసిన క్రమంలో…. సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిన బ్యాక్ ఎండ్ నేతలు… తాజాగా మరోసారి ఇల్లీగల్ దందాకు తెర లేపారట. ఏకంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న క్వార్టర్స్ ను, ఇతర ప్రాంతాలను అడ్డాగా చేసుకోవడంచర్చనీయాంశంగా మారింది. ఐతే ఈ ఇల్లీగల్ దందా ఒక్కరి చేతి మీదుగానే నడవాలని స్థానిక కాంగ్రెస్ నేతలు అనుకోవడం వల్లే ఈ విభేదాలు రచ్చకెక్కినట్టు చెప్పుకుంటున్నారు. రెండిటిలో ఒక గ్రూపునకు ఆర్దిక బలం ఉంటే.. మరో గ్రూప్‌ది రెండుసార్లు గెలిచిన అనుభం. దీంతో… మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న ఈ దందాలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఎవరికి వారు భావించారట. అందులో నుంచి పుట్టుకువచ్చిన విద్వేషమే తాజా పరిణామం అని అంటున్నారు పరిశీలకులు.
Also Read
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ఈ వ్యవహారం ఎమ్మెల్యేకు తలనొప్పి కాగా… కౌన్సిలర్లతో ప్రత్యేకంగా సమావేశమైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఏదైనా…. పంచాయితీ ఉంటే తన దగ్గరకు రావాలని, సోషల్ మీడియాలో రచ్చ చేసుకోవడం ఏంటని ఫైరైనట్టు సమాచారం. మీ పనులు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారితే ఎవర్నీ ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే జైవీర్ కౌన్సిలర్స్‌ని హెచ్చరించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వైస్ చైర్మన్ పెత్తనం ఎక్కువైందని ఒకరిద్దరి కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారట. సదరు సీనియర్ నేత మూడు దశాబ్దాలుగా పెద్దాయనతో, తమ కుటుంబంతో కలిసి పనిచేసిన అనుభం ఉన్నందున ఈ విషయాన్ని తన తండ్రి జానారెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్ళి సెట్ చేస్తానని, అంతా సమన్వయంతో కలిసి పని చేయాలని.. సూచించారట ఎమ్మెల్యే. అయితే… ఈ ఇల్లీగల్ దందా కోరల్ని ఆదిలోనే తుంచేయకపోతే… సరిహద్దులో అది హద్దుమీరిపోయి…. అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రతిపక్షాల చేతిలో అస్త్రంగా మారి మొత్తం కుందూరు ఫ్యామిలీనే డ్యామేజ్ చేస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ నుంచి.
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!