Occult Worship: హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపి. హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ యుకుడిని చంపి శవాన్ని కల్చివేశారు గుర్తు తెలియని దుండగులు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Read also: Jabardasth Varsha : ఆస్పత్రిలో చేరిన వర్ష.. ఆందోళనలో జబర్దస్త్ టీం
హైదర్ నగర్ లోని అలీ తలాబ్ స్మశాన వాటిక వద్ద గుర్తు తెలియని శవం మంటల్లో కాలుతూ వుండటంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శవాన్ని ఎవరో హత్యచేసి కాల్చేసినట్లు భావించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రేపు అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో బలిచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. పరిసర ప్రాంతాలలో క్షుద్ర పూజలు జరిగినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లు వుండటంతో పోలీసులు క్షుద్ర పూజలు చేసి బలి ఇచ్చి, శవాన్ని కల్చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు ఎవరు అన్నది ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.