Oasis Fertility Celebrated World IVF Day: ప్రపంచంలో మొదటి ఐవిఎఫ్ బేబీ అయిన లూయిస్ బ్రౌన్ 45వ పుట్టినరోజును మనం జరుపుకుంటున్నప్పటికీ, సంతానం లేకపోవడాన్ని ఒక కళంకంగా ఆందోళన చెందుతున్న జంటలు తమ వంధ్యత్వం గురించి మాట్లాడటం ఇప్పటికీ అసౌకర్యంగా భావిస్తున్నారు. అనేక ఆవిష్కరణలు ఐవిఎఫ్ చికిత్సల విజయాల రేటును, భద్రతను మెరుగుపరిచాయి. కానీ సంతానోత్పత్తి సవాలును ఎదుర్కుంటున్న అనేక జంటలకు వంధ్యత్వాన్ని అధిగమించడంలో సహాయపడే సహాయక ఫెర్టిలిటీ సాంకేతికతలో ఉన్న అనేక అవకాశాల గురించి ఇప్పటికీ తెలియదు.
భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి గొలుసుకట్టు సంస్థలలో ఒకటైన ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కో-ఫౌండర్ & మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జీ రావు, ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ & క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మరియు ఒయాసిస్ ఫెర్టిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ ఈ సందర్భంగా సంతానలేమి సమస్య ఎదుర్కుంటున్న జంటల కోసం ‘ఆస్క్ ఒయాసిస్ ఫెర్టిలిటీ’ పేరుతో ఏఐ-ఆధారితమైన ముఖాముఖిగా తెలుసుకునే ఛాట్‌బాట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ కో ఫౌండర్ & మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జీ రావు మాట్లాడుతూ..‘‘వేలాది జంటలు ఐవిఎఫ్ ద్వారా తల్లితండ్రులయ్యే అవకాశాన్ని సాధించడంలో సహాయపడిన ఫెర్టిలిటీ నిపుణులు, ఎంబ్రియాలజిస్ట్‌లు మరియు గైనకాలజిస్ట్‌లందరినీ ఈ సందర్భంగా నేను మనఃస్పూర్తిగా అభినందిస్తున్నాను. అనేక వైద్య పురోగతులు రిస్క్‌ను తగ్గించడంతో పాటు ఐవిఎఫ్‌ల విజయాల రేట్లను మెరుగుపరిచాయి. డ్రగ్ ఫ్రీ ఐవిఎఫ్ అనేది ఒక కొత్త మరియు అధునాతనమైన చికిత్స. తక్కువ తీవ్రత కలిగి మరియు తక్కువ ఖర్చును ఇష్టపడే చాలా మంది మహిళలకు ఇది ఒక వరం. మొదటి ఐవిఎఫ్ శిశువు జన్మించి 45 సంవత్సరాలైనా, ఐవిఎఫ్ గురించి ప్రజలకు ఇప్పటికీ భయాలు ఉండడం హాస్యాస్పదం. ఒక మహిళకు 30 ఏళ్లు దాటిన తర్వాత సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుతుంది, కాబట్టి మహిళలు తమ జీవ గడియారం ఏమి చెబుతున్నదో వినాలి. మీరు సంతానం పొందాలనే నిర్ణయాన్ని వాయిదా వేయాలని అనుకుంటే, మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి మరియు మీ సౌలభ్యం మేరకు పేరెంట్‌హుడ్‌ని పొందేందుకు మీకు ఉపయోగపడే సోషల్ ఫ్రీజింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి’’ అని అన్నారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ, సైంటిఫిక్ హెడ్ & క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ‘‘తక్కువ లేదా సున్నా స్పెర్మ్ కౌంట్ ఉన్న పురుషుల విషయంలో, ఇదివరకు డోనర్ ట్రీట్‌మెంట్ అవసరమైన వారిలో కూడా ఇప్పుడు వారి సొంత జన్యు సంబంధమైన పిల్లలను పొందడం సాధ్యమైంది, గత 45 సంవత్సరాలలో అనేక ఆవిష్కరణలు వచ్చినందుకు ఆనందంగా వుంది. పురుషులు తమ సంతానోత్పత్తిని పెంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలి. నేను నొక్కి చెప్పదలుచుకున్న మరో విషయం ఏమిటంటే, ఐవిఎఫ్ పిల్లలు కూడా సహజంగా జన్మించిన శిశువుల మాదిరే ఉంటారు. ఫెర్టిలిటీ నిపుణుడితో సంతానలేమి సమస్య గురించి సంతానం కోరుకునే జంటలు చర్చించవలసి ఉంటుంది, అప్పుడే వారికి వంధ్యత్వాన్ని అధిగమించడంలో సరైన జోక్యం సహాయపడుతుంది’’ అని సూచించారు.
అనంతరం ఒయాసిస్ ఫెర్టిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ.. ‘‘రోగి ఫలితాలను మెరుగుపరచడానికి మా ప్రక్రియలు మరియు రోగి మంచి నిర్ణయాలను తీసుకోవడంలో మేము ఎప్పుడూ కొత్త సాంకేతికతలతో ముందుకు వచ్చాము. ఆస్క్ ఒయాసిస్ ఫెర్టిలిటీ అనేది ఎఐ- పవర్డ్ నాలెడ్జ్ ప్లాట్‌ఫారమ్, ఇది సంతానలేమి సమస్యకు సంబంధించిన సమాచారం కోసం ఒక ఎన్‌సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది. సరైన పరిజ్ఞానం కలిగివుండడం అనేది ఎంతో కీలకం మరియు సంతానలేమితో బాధపడుతున్న జంటలకు ఒక సరైన ఛానెల్ అనేది లేనందున వారి కష్టాలను మేము అర్థం చేసుకున్నాము, దీని ద్వారా వారు వంధ్యత్వం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఇంటరాక్టివ్ చాట్‌బాట్ జంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మరియు తల్లితండ్రులు కావాలనుకునే వారి ప్రయాణంలో వారికి సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి :
సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో భాగమైన ఒయాసిస్ సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అత్యుత్తమ వైద్య నియమావళిని, పద్దతులను అందుబాటులోకి తీసుకురాడం ద్వారా దక్షిణ భారతదేశంలో సంతాన సాఫల్యానికి ఒక సరి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ కేంద్రంలోకన్సల్టేషన్, ఇన్వెస్టిగేషన్ మరియు ట్రీట్మెంట్లకు సంబంధించి ఈ రంగంలో అమలు అవుతున్నవిధానాలకు భిన్నంగా ఒక సరి కొత్త పద్దతిలో ఒకేచోట, ఒకే రోజు నిర్వహించి తద్వారా కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటూ అన్ని వైద్య సేవలను కూడా ఒక్క రోజులోనే ‘ఒన్ స్టాప్’గా అందిస్తున్నది. 2009లో స్థాపించినప్పటి నుండి ఒయాసిస్ అంతర్జాతీయ అనుభవంతో అత్యంత అనుభవజ్ఞులైన ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ల బృందం నేతృత్వంలో అధికనాణ్యత సేవల ద్వారా నడిచే అధిక విజయాల రేట్‌తో అద్బుతమైన ఖ్యాతిని పొందింది. ఒయాసిస్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర మరియు ఒడిశా రాష్ట్రాలలో ప్రస్తుతం 30 కేంద్రాలు వున్నాయి.