Balmoori Venkat: సిద్దిపేటలో బల్మూరి వెంకట్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఆదివారం సిద్దిపేట జిల్లా బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం బహిర్గతం కావద్దనే ఉద్దేశంతో పాఠశాలలోనే ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం వారిని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆ విద్యార్థులను కలిసి వారిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హుజూరాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను సిద్దిపేట జిల్లా రామునిపట్ల వద్ద పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. బల్మూరి వెంకట్ వాహనాన్ని అడ్డుకున్న క్రమంలో స్థానిక ఎన్ఎస్‌యూఐ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసులను నిలువరించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా వాతావరణం రణరంగంగా మారింది. తాను కేవలం వారి ఆరోగ్య పరిస్థితిని మాత్రమే తెలుసుకునే ఉద్దేశంతో పోతున్నామని వెంకట్ బల్మూరి పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన వినని పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని చిన్నకోడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టుకు నిరసనగా సిద్దిపేట మైనారిటీ గురుకుల పాఠశాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
Also Read
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?