Site icon NTV Telugu

BJP Namination: నేటి నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు.. రాష్ట్రానికి కేంద్రమంత్రులు..

Bjp Naminations

Bjp Naminations

BJP Namination: నేటి నుంచి తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికలకు నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభకానుంది. ఇవాళ బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు వివరాలను బీజేపీ విడుదల చేయనుంది. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నట్లు పేర్కొంది. నేడు మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నట్లు బీజేపీ తెలిపింది. మెదక్ రఘునందన్ రావు నామినేషన్ కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హజరు కానున్నారు. మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ నామినేషన్ కుకేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్ కు పీయూష్ గోయల్ రానున్నట్లు తెలంగాణ బీజేపీ శ్రేణులు తెలిపారు.

Read also: Lok sabha elections 2024: నాలుగో దశకు నేడు నోటిఫికేషన్‌

రేపు (19)న సికింద్రాబాద్, ఖమ్మం నామినేషన్ లు, కిషన్ రెడ్డి, వినోద్ రావు ల నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల , నల్గొండ, మహబూబ్ బాద్ కాండిడేట్ ల నామినేషన్ లు వేయనున్నట్లు, జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్ కు దేవేంద్ర ఫడ్నవీస్‌, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్ కు పీయూష్‌ గోయల్, మహబూబ్ బాద్ సీతారాం నాయక్ నామినేషన్ కు కిరణ్ రిజిజు రానున్నారు.

Read also: Time Magazine: టైమ్‌ మేగజీన్‌ 2024 లో ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..

అలాగే.. 23న భువనగిరి, 24 న పెద్దపల్లి అదిలాబాద్ హైదారాబాద్ వరంగల్ ల నామినేషన్ లు వేయనున్నట్లు, పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్ కు అశ్విని వైష్ణవ్, అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్ కు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, హైదారాబాద్ మాధవి లత నామినేషన్ కు అనురాగ్ సింగ్ ఠాకూర్, వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్ కు అశ్వినీ వైష్ణవ్, 25 న కరీం నగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్, కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్ లా నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి లు, నిజమాబాద్ అరవింద్ నామినేషన్ కు అశ్విని వైష్ణవ్ లు హాజరు కానున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.
Pushpa 2 : భారీ ధరకు పుష్ప 2 నార్త్ ఇండియా రైట్స్..

Exit mobile version