Site icon NTV Telugu

NO Purchase Day : కేంద్రం తీరుపై పెట్రోల్ డీల‌ర్ల నిరసన

Petrol Prices

Petrol Prices

కేంద్ర ప్ర‌భుత్వం పెట్రో ఉత్ప‌త్తుల‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా త‌గ్గించ‌డాన్ని తెలంగాణ పెట్రోలియం డీల‌ర్స్ అసోసియేష‌న్ త‌ప్పుప‌ట్టింది. ఇలా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా త‌గ్గించ‌డంతో డీల‌ర్లంద‌రికీ భారీగా ఆర్థిక న‌ష్టాలు వ‌చ్చాయ‌ని పెట్రోలియం డీల‌ర్స్ అసోసియేష‌న్ పేర్కొంది. ఈ అంశంపై చ‌ర్చించ‌డానికి పెట్రోలియం డీల‌ర్స్ అసోసియేష‌న్ శుక్ర‌వారం రాష్ట్ర‌స్థాయి వ‌ర్చువ‌ల్ స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ నేపథ్యంలో ఈ వ‌ర్చువ‌ల్ స‌మావేశానికి 18 జిల్లాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా అసోసియేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మే 31 న డీల‌ర్లు ఎవ్వ‌రూ చ‌మురు కంపెనీల నుంచి పెట్రోల్‌ను కొనుగోలు చేయ‌కుండా.. నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని పిలుపునిచ్చింది. ‘నో ప‌ర్చేస్ డే’ అనే పేరున నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని టీపీడీఏ పిలుపునిచ్చింది. టీపీడీఏ ఇచ్చిన ఈ పిలుపుకు డీల‌ర్లంద‌రూ క‌చ్చితంగా క‌ట్టుబ‌డి వుండాల‌ని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు పిలుపునిచ్చారు. IOC, BPC & HPC యొక్క మొత్తం 7 సరఫరా స్థానాల్లో లోడింగ్ మరియు పంపకాలు జరగకుండా చూసుకోవాలని అసోసియేష‌న్ డీల‌ర్ల‌కు పిలుపునిచ్చింది.

Exit mobile version