Site icon NTV Telugu

Telangana GHMC:: వర్షాలు తగ్గేవరకు సెలవుల్లేవ్‌.. సర్కార్‌ ఆదేశం

Ghmc

Ghmc

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో జనజీవనం అతలాకుతలం అయ్యింది. అయితే జీహెచ్ ఎంసీ ఉద్యోగులు, కార్మికులను సైతం తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరంలో ఇప్పటికే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కురిసే అవకాశముంది. దీంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందికి వర్షాలు తగ్గే వరకు సర్కారు సెలవులను రద్దు చేసింది. వానలు తగ్గేవరకు నగరవాసులకు అందుబాటులో వుండాలని పేర్కొంది. రౌండ్‌ ది క్లాక్‌ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని 363 ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా వుండాలని సర్కార్‌ ఆదేశించింది.

read also: Trains Cancelled: వర్షాల, వరదల ఎఫెక్ట్.. 17వ తేదీ వరకు రైళ్లు రద్దు

మహా నగరంలోని మూడు భారీ నాలాలు, ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్‌ సాగర్‌ లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అయితే.. సాగర్‌ గరిష్ట నీటి మట్టానికి నీరు చేరటంతో అధికారులు 1500 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లోకు తగిన విధంగా 1500 క్యూ సెక్కుల ఔట్‌ ఫ్లోతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గాంధీనగర్‌, సబర్మతినగర్‌,దోమల్‌ గూడ, నల్లకుంట, అంబర్‌పేట్‌ తదితర నాలాల పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇది ఇలా వుండగా ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని నాగోల్‌ సమీపంలోని అయ్యప్పనగర్‌ కాలనీ మొత్తం జల దిగ్భంధంలో చిక్కుకుంది. దీంతో అక్కడి స్థానికులు ఇళ్లు కాళీ చేసి వెల్లిపోతున్నారు. కాగా.. గత సంవత్సరంలో కూడా ఇదే కాలనీ, ఇదే నెలలోనే నీట మునిగిందని బాధితులు వాపోయారు. మళ్లీ తమకు ముంపు సమస్య తప్పలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

I2U2: నేడు తొలి సమావేశం.. పాల్గొననున్న ప్రధాని మోదీ

Exit mobile version