TSRTC: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో వివిధ రూట్లలో పల్లెటూరి బస్సుల్లో ప్రయాణించే వారు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఎక్స్ ప్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఆదివారంతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరగలేదని అధికారులు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలు, యువతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈ నెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రావడంతో.. చాలా మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. అయితే.. గత ఆదివారం (డిసెంబర్ 3)తో పోలిస్తే ఈ ఆదివారం (డిసెంబర్ 10) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. టిమ్స్‌లో ‘జీరో టికెట్’ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చాక వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు.
Read also: PrajaVani: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు
ఇతర రోజుల కంటే సోమవారాలు బస్సులు సాధారణంగా రద్దీగా ఉంటాయి. నేడు కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్ల సెలవులను రద్దు చేశారు. సిబ్బందికి సెలవులు లేవని, విధులకు హాజరుకావాలన్నారు. వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో బస్సులు 31-32 లక్షల కిలోమీటర్లు నడుస్తుండగా, సోమవారం నాటికి వాటి సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. ఈరోజు 10 శాతానికి పైగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తుంది.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్