Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ పుణ్యమా అని ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. దీనివల్ల కొన్ని కుటుంబాలు సర్వ నాశసనం అయ్యాయి. అయినా.. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నడుస్తూనే ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. దీనిపై పోలీసులు అవగాహన కల్పిస్తూ హెచ్చరిస్తున్నా, సన్నిహితులు వారిస్తున్నా కొందరు మాత్రం బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తీసుకున్న అప్పులు మళ్లీ తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, అప్పు తీర్చలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Read also: Hyderabad Rains: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. మరో మూడు రోజులు వానలు
బెట్టింగ్ బానిసై.. కుటుంబంతో సహా ఆత్మహత్య..
వడ్డే పల్లిలో గ్రామంలో సురేష్ ఆయన భార్య హేమలత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీష్ అనే కొడుకు వున్నాడు. అయితే హరీష్ తల్లిదండ్రులకు అండగా వుండాల్సిపోయి వారిని పట్టించుకోకుండా ఎప్పుడు ఫోన్ లోనే గడిపేవాడు. అయినా తల్లిదండ్రులు ఎప్పుడు మందలించలేదు. ఇదే అదునుగా భావించిన హరీష్ రాను రాను ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. అందులో డబ్బులు పెడుతూ వచ్చాడు. అలా వందలు, వేలు కాదు ఏకంగా లక్షల్లో బెట్టింగులు కాయడం మొదలు పెట్టాడు. ఈవిషయం తెలిసిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఎంతవరకు బెట్టింగులకు అప్పులు చేశావని కొడుకును అడిగారు. సుమారు రూ.30 లక్షల వరకు అని హరీష్ చెప్పడంతో తల్లిదండ్రుల గుండె ఆగిపోయింది.
కొడుకును మందలించిన అప్పు తీర్చాల్సిందేనని.. జీవనోపాధిగా వున్న పొలాన్ని అమ్మారు. అయినా అప్పు తీరకపోవడంతో ఏం చేయాలో కుటుంబానికి అర్థం కాలేదు. ఇంకా వున్న అప్పు ఎలా తీర్చాలి అనే ప్రశ్న ఎదురైంది. ఇక చేసేది ఏమీలేక చావే దిక్కని ముగ్గురు నిర్ణయించుకున్నారు. ఇంట్లో ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు అప్పు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. కొడుకు కోసం కుటుంబం మొత్తం ఉరితాడుకు వేలాడింది అంటూ కన్నీటి పర్వతం అయ్యారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Nanebiyam Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. ఏ నైవేద్యం సమర్పిస్తారు ?