Arvind Dharmapuri: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాక్యలు చేశారు. కేటీఆర్ ది పాదయాత్రనా? లేక పదవుల యాత్రానా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రేవంత్ దేవుళ్ళ మీద ఓట్టేసి రైతులను నట్టేటా ముంచాడన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు ఓటకి తప్పదని తెలిపారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదన్నారు. కులగణన పకడ్బందీగా చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నారు. కేటీఆర్ పాదయాత్ర హాస్యాస్పదం.. కేటీఆర్ పాదయాత్ర చేస్తే చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలకండన్నారు. కేటీఆర్ ది పాదయాత్రనా? లేక పదవుల యాత్రానా? స్పష్టం చేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ అన్నారు. వక్ఫ్ బోర్డ్ చట్టం దుర్మార్గపు చట్టమన్నారు. పార్లమెంటు చట్టాలను ఉల్లంగిస్తే ఎంఐఎం పై కఠిన చర్యలకు సిద్ధమని తెలిపారు. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తానని హిందు దేవుళ్ళ మీద ఒట్టేసిన రేవంత్, ముస్లిం దేవుళ్ళ మీద ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు.
D.K Aruna: కాలేజీ అమ్మాయిల స్కూటీ లు ఎటు పాయే.. సీఎం రేవంత్ ట్వీట్ పై డీకే అరుణ ఫైర్..