NTV Telugu Site icon

MLC Kavitha: మేము పసుపు బోర్డు డిమాండ్ చేసినప్పుడు ఎంపీ అరవింద్ రాజకీయాల్లో లేరు!

Kavitha

Kavitha

MLC Kavitha: నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలా ఉంది.. పార్లమెంట్ సభ్యురాలిగా తాను ఐదేళ్లు లోక్ సభలో పసుపు బోర్డు కోసం కోట్లాడాను అన్నారు. దీని కోసం 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాసి.. కేంద్రంపై ఒత్తిడి పెంచాను అని పేర్కొన్నారు. ఇప్పుడు, ప్రోటోకాల్ పాటించకుండా బోర్డు ప్రకటించారు అని ఆరోపించింది. పసుపు బోర్డు రావడంతో సంపూర్ణం కాదు.. రైతులను కనీస మద్దతు ధర 15 వేల రూపాయలు రావాలి అని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Read Also: Ind Vs Eng Series: ధనాధన్ ఇన్నింగ్స్‭లకు వేళాయే.. కోల్‌కతాకు చేరుకున్న టీమిండియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు

ఇక, 2014 నుంచి పసుపు దిగుమతులు మన దేశంలోకి పెరిగాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి.. అలాగే, దిగుమతులు నియంత్రించాలన్నారు. అలాగే, పసుపు ప్రాంతాల్లో ఉంటే ప్రజా ప్రతినిధులకు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా చేర్చాలని డిమాండ్ చేసింది. ఇక, మేము పసుపు బోర్డు డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయాల్లో లేరు అని ఎద్దేవా చేసింది. మా ప్రభుత్వ హయాంలోనే స్పైసిస్ పార్క్ ఏర్పాటు చేశాం.. వేల్పూర్ లో 42 ఎకరాలు కేటాయించాము.. పసుపు బోర్డు అవసరం లేదని స్పైసీస్ బోర్డు మేలని అరవింద్ గతంలో అన్నారు.. ఎవరు ఏం చేయకున్నా బంగారం లాగే పసుపు ధర ప్రతి ఏటా పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక, ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లాకు ఎయిర్ పోర్టు తీసుకు రావాలి అని కవిత పేర్కొంది.